పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వేణు శ్రీరామ్ దర్వకత్వంలో ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన27వ చిత్రాని ఈరోజు (బుధవారం) ప్రారంభించారు. క్రిష్ దర్వకత్వంలో వహిస్తున్న ఈ సినిమా తొలి షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. కాగా షూటింగ్ పరిసరాల్లోకి మీడియాను అనుమతించలేదు. డబుల్ ధమాకా లభించడంతో పవర్‌స్టార్ అభిమానులకు పండగ చేసుకుంటున్నారు.