దేశవ్యాప్తంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. నార్త్ లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగువున ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో వరద ఉదృతి పెరుగుతున్నది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా.. నదులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ధవళేశ్వరం, పోలవరం ప్రాంతంలో వరద ఉదృతి పెరిగింది. పోలవరం ప్రాంతంలోని 34 గిరిజన గ్రామాలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడి ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు భీమవరంలో సమావేశం అయ్యారు. ఎన్నికల తరువాత భీమవరంలో పవన కళ్యాణ్ రాజకీయ సమావేశం జరపడం ఇదే తొలిసారి. వరద సహాయ చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా పవన పిలుపునిచ్చారు. కార్యకర్తలు పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు.