పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘హరి హర వీరమల్లు’ సెట్స్ పై ఉండగా, ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. ఇక ఆ తరువాత లైన్లో సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడనే విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ మరో మూడు రీమేకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ రెండు మూడు రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఒక రీమేక్ కి సముద్రఖని దర్శకత్వం వహించనుండగా, మరో రీమేక్ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలవుతున్నాయని చెబుతున్నారు.
‘స్వామిరారా’ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్ వర్మ, ఆ తరువాత ‘దోచేయ్’, ‘కేశవ’, ‘రణరంగం’ సినిమాలు చేశాడు. అయితే అవి అంతగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన రవితేజతో ‘రావణాసుర’ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పవన్ తోనే సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.