Pawan Kalyan in AP politics: దెబ్బ అదుర్స్ కదూ!
రేపటితో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తెలియనుంది. అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేయకముందే.. పవన్ కళ్యాణ్ అభిమానులు అలానే చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్.. పండగలు మొదలు పెట్టేసారు. ఎందుకంటే ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయింది కాబట్టి.
కాగా చివరి నిమిషంలో సూపర్ ఎంట్రీ ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం మార్చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దెబ్బకి వైయస్ఆర్సీపీ నాయకులు అబ్బా అనక తప్పలేదు. అసలు విషయానికి వస్తే.. ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ని ఎన్ని విధాల నాశనం చేయాలో అన్ని విధాలా నాశనం చేశారు వైసిపి.. నాయకులు. కానీ వారు చేసిన ఫ్రీ దానాల రిత్యా.. కొంతమంది మాత్రం తమకు వచ్చిన ఆ చిన్న మొత్తాన్ని చూశారు తప్ప.. తమ వెనక వైసిపి.. నాయకులు తీస్తున్న పెద్దగుంటని చూడలేకపోయారు.
ఇక దాంతో ఈసారి కూడా వైసిపి వస్తుందేమో అని ఆంధ్ర పాలిటిక్స్ తెలిసినవారు చాలామంది కంగారు పడ్డారు.
కానీ అలాంటి టైం లోనే.. ఒక అదృష్టం వచ్చి పడింది. అదేమిటి అంటే పవన్ కళ్యాణ్.. టిడిపి తో పొత్తు పెట్టుకోవడం. ఇది జరగకుండా ఉంటే.. ఓట్లు ఎక్కడికక్కడ చీలిపోయి.. మరోసారి వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. కానీ చివరిలో తన సూపర్ స్టార్ ఎంట్రీ ఇచ్చి.. సినిమాల లాగానే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చేశారు పవన్ కళ్యాణ్. దెబ్బ అదుర్స్ కదా అని రజనీకాంత్ స్టైల్ లో.. వైసీపీ నాయకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.
అన్నిటికన్నా ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పై ప్రజలకు కొన్ని ఆశలను రేకెత్తించారు. తన సినిమాలను సైతం పక్కన పెట్టి.. ఈ ఎలక్షన్స్ కోసం ఎంతో కష్టపడ్డారు ఈ హీరో. దాదాపు తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నా కానీ.. డబ్బు కన్నా ప్రజలే మిన్న.. అనే మాటలను.. చేతల్లో చేసి చూపించారు. ఎంతోమంది ఈ హీరో సినిమా నిర్మాతలను…దర్శకులను కష్టపడుతున్నారని వెబ్సైట్లో రాస్తున్నారు. కానీ అక్కడ అలా జరగడానికి కారణం.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అని.. పవన్ కళ్యాణ్ ని పూర్తిగా చదివిన వారు ఎవరైనా చెప్పగలరు.