
Hari Hara Veera Mallu release date:
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా హరి హర వీర మళ్ళు. ఈ మూవీ మొదటగా మార్చి 28న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు అది మే 9కి వాయిదా పడింది. కానీ ఇప్పుడు మే 9న కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు కాస్త డౌట్‌ఫుల్ అనిపిస్తున్నాయి.
ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తవ్వలేదు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తిచేయడానికి ఇంకా నాలుగు రోజులు కేటాయించాల్సి ఉంది. అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ తన బాడీ వెయిట్ 8 కేజీలు తగ్గించి, షూట్ కోసం సిద్ధమవుతున్నాడు. కానీ ఈ మధ్యే ఆయన తనయుడు చిన్న యాక్సిడెంట్‌కు గురయ్యాడు. దాంతో పవన్ వెంటనే సింగపూర్ వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చాక షూట్ లో పాల్గొనబోతున్నాడు.
ఇదిలా ఉండగా, ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో రైట్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లు డేట్ ఖరారు చేయాలని ప్రెషర్ పెడుతున్నారు. మే 9కి మూవీ రిలీజ్ కాకపోతే, డీల్ ని 50 శాతం తగ్గిస్తామని లేదా పూర్తిగా వెనక్కి తీసుకుంటామని అమెజాన్ నుంచి వార్నింగ్ వచ్చిందట.
ఈ విషయమంతా పవన్ కళ్యాణ్ వరకు కూడా చేరింది. నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే ప్లానింగ్‌లో ఉన్నారు. త్వరలో పవన్ వచ్చి షూట్ పూర్తి చేస్తే, మే 9న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మరోసారి పోస్ట్‌పోన్ కావడం ఖాయం!
ALSO READ: Naga Chaitanya కొత్త రెస్టారెంట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు