HomeTelugu Trendingనిత్యావసరాలు ప్రజల వద్దకే తీసుకెళ్లండి: పవన్‌ కల్యాణ్‌

నిత్యావసరాలు ప్రజల వద్దకే తీసుకెళ్లండి: పవన్‌ కల్యాణ్‌

11 21
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ‘హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నో అబ్జెక్షన్ పత్రాలతో బయలుదేరిన వారిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఆపివేయడంతో నడిరోడ్డుపై ఇప్పటికీ ఇబ్బందులుపడుతున్నారు అని అన్నారు. హాస్టల్స్ మూసివేతపై రెండు రాష్ట్రాల అధికారులు ముందే సమన్వయంతో చర్చించుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. వీరిలో చదువుకుంటున్నవారు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న యూత్‌ ఉన్నారు. వారి వేదనను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకొని స్వస్థలాలకు చేర్చాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేసి హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించండి. అలా రోడ్డుపై గుంపులుగా వదిలేస్తే కొత్త సమస్యలు వస్తాయి’ అని ఆయన అన్నారు.

”రాష్ట్రంలోని హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందిలో అందరికీ ఎన్-95 మాస్కులు అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానితుల శాంపిల్స్ సేకరించి పరీక్షించే సిబ్బందితో పాటు సంబంధిత వైద్యులను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, రక్షణ దుస్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. ఔట్ పేషెంట్ (ఓపీ) విభాగంలో ఉన్నవారికీ వీటిని అందించడం అవసరం. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యతో పాటు వాటిలో శాంపిల్స్ పరీక్షించే సామర్థ్యాన్ని పెంచాలి” అని సీఎంకు సూచించారు.

”నిత్యావసరాల కోసం రైతు బజార్లు, కిరాణా దుకాణాల దగ్గర జనం ఇప్పటికీ క్యూ కడుతున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత ఉండదు. అన్నీ అందుబాటులోకి తీసుకువస్తామనే భరోసాను ఏపీ ప్రభుత్వం కల్పించాలన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం బలంగా చెబుతున్నా… రైతు బజార్లలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోతే ఎలా? ప్రజల ముంగిటకే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకువెళ్తే రోడ్డు మీదకు జనం రావడం గణనీయంగా తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి” అని ఆయన అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu