HomeTelugu Newsబీజేపీతో పొత్తు పై పవన్‌ కల్యాణ్‌ స్పష్టత..

బీజేపీతో పొత్తు పై పవన్‌ కల్యాణ్‌ స్పష్టత..

11 9
జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో వనన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నామని చెప్పారు. బీజేపీ అగ్ర నాయకత్వంతో గతంలో పలుమార్లు చర్చలు జరిగాయని పవన్‌ తెలిపారు. పొత్తు విసయంలో ఇరు పక్షాల నుంచి ఎలాంటి షరతులు లేవని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీతో కలసి పనిచేసినట్లు పవన్‌ గుర్తుచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలని.. లేని పక్షంలో అపోహలకు గురయ్యే ప్రమాదం ఉందని పవన్‌ పేర్కొన్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్య్టా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడుతున్నాయని పవన్‌ అన్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించాలని.. అర్హులైన పేర్లను కార్యకర్తలే సూచించాలన్నారు. ఇక నుంచి నెలలో కొన్ని రోజులపాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు పవన్‌ హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu