Homeపొలిటికల్Pawan Kalyan: వరద బాధితుల కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి భారీ విరాళం

Pawan Kalyan: వరద బాధితుల కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి భారీ విరాళం

Pawan Kalyan Steps Up: Crores Donated to Flood-Hit Areas
Pawan Kalyan Steps Up: Crores Donated to Flood-Hit Areas

Pawan Kalyan to flood victims:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకే కాకుండా, ప్రజల కోసం నిరంతరం చేసే సేవలతో కూడా కోట్లాది మంది అభిమానాన్ని పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాలను నూటికి నోరు శాతం పూర్తిచేస్తున్ Pawan Kalyan వరద సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వరద బాధితులకు సాయం అందించేందుకు భారీ విరాళాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ.1 కోటి విరాళం ప్రకటించారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.

ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, “వరదల వల్ల జరిగిన నష్టం చూసినప్పుడు రూ.1 కోటి తగదు అని అనిపించింది. అందుకే మరో రూ.4 కోట్లు 400 వరద ప్రభావిత పంచాయతీలకు ఇస్తున్నాను” అని చెప్పారు.

పవన్ కళ్యాణ్ మరో కీలక ప్రకటన చేస్తూ, “మన పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా వరదల వల్ల తీవ్రంగా నష్టపోయింది. అందుకే రూ.1 కోటి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలిసి ఈ మొత్తం అందజేస్తాను. నేను బయటకు రాలేదని విమర్శించేవాళ్లకు నా కాన్వాయ్‌లో వచ్చి పరిస్థితులను స్వయంగా చూడమని కోరుతున్నాను. ఈ కష్టకాలంలో సాయానికి ముందుకొచ్చిన సినీ ప్రముఖులకు నా కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌ సాయం అందించడం తో ప్రజల్లో ఆయన సేవాభావం పట్ల మరింత గౌరవం పెరిగింది. ఈ విరాళాలు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కొంత ఊరటనిస్తాయి అని అందరూ భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu