సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించిన జనసేనాని.. మరికొన్ని జిల్లాల నేతలతో అక్కడి పరిస్థితులపై సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై పవన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే మరోసారి ఆయన విశాఖ వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న పవన్ విశాఖ వెళ్లనున్నారు. 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా నాయకులతో సమావేశమవుతారు. అదే రోజు మధ్యాహ్నం పాడేరులో బహిరంగసభలో పాల్గొంటారు. 24వ తేదీన విజయనగరం జిల్లా నేతలతో, 25వ తేదీన విశాఖపట్నం జిల్లా నేతలతో పవన్ చర్చిస్తారని పార్టీ నేతలు చెప్పారు.