లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పోరాట యాత్రలో భాగంగా పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ.. “దేశభక్తి కేవలం బీజేపీకే ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. వారికంటే పదిరెట్లు ఎక్కువ మనకూ ఉంది. సరిహద్దుల్లో యుద్ధానికి తెరతీశారు. యుద్ధం రాబోతోందని నాకు రెండేళ్ల క్రితమే చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో మన దేశం ఉందో దీనిని బట్టే మీరు అర్థంచేసుకోవచ్చు” అన్నారు.
“ముస్లింలు దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరంలేదు. హిందువులకు ఈ దేశంలో ఎంత హక్కు ఉందో ముస్లింలకు కూడా అంతే ఉంది. అన్ని మత ధర్మాలను కాపాడేది మన భారతదేశం. పాకిస్థాన్‌లో ఉన్న హిందువులకు ఎంత స్థానం ఇస్తారో నాకు తెలీదు కానీ భారతదేశం ముస్లింను గుండెల్లో పెట్టుకుంటుంది. రాయలసీమ యువతలో నేను బలమైన మార్పు కోరుకుంటున్నాను. ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన జయప్రకాశ్ నారాయణ్‌ను ఉండనివ్వలేదు. ఎంతో చేద్దామని వచ్చిన చిరంజీవికి సాధ్యపడనివ్వలేదు. పోతే ప్రాణాలు పోవాలి కానీ నేనైతే ఆశయాలను చంపుకోను”అని అన్నారు పవన్ కల్యాణ్.