ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్ట్ 22). ఈ సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని అని ఎమోషనల్ అయ్యారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగి, తనలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. చిరంజీవి తనకు కేవలం అన్నయ్యే కాకుండా దైవంతో సమానమని వెల్లడిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అందించారు.
అన్నయ్య చేయిపట్టి పెరిగానని, ఆయనే తన తొలిగురువు అని పవన్ పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమనులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని పొగిడారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్పరతను ఆవిష్కరింపజేసిందన్నారు. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయన సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారని పవన్ పేర్కొన్నారు.