కమెడియన్ వేణుమాధవ్ మృతికి జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. అందర్నీ నవ్వించిన వేణు మాధవ్ ఇకలేరు అనే విషయం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ”కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారని అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. ‘గోకులంలో సీత’ చిత్రం నుంచి తనతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో సరదాగా అందర్నీ నవ్వించేవారు. వర్తమాన రాజకీయాలపై ఆసక్తి చూపేవారు. వేణుమాధవ్ మృతికి తనతో పాటు జనసైనికుల తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వేణు ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నా” అంటూ పవన్ సంతాప సందేశంలో పేర్కొన్నారు.