కరోనాతో సహజీవనం చేయాల్సిందే తప్పదంటున్న ఏపీ ప్రభుత్వాన్ని.. స్టైరీన్ విషవాయువుతో కూడా సహజీవనం చేయాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా ప్రశ్నించారు. ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనకు పరిష్కారం ఎప్పుడని నిలదీశారు. ధైన్యంగా మిగిలిన బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనాతో కలిసి జీవించాల్సిందేనని చెప్తున్న ప్రభుత్వం.. బాధితులు స్టైరీన్ విషవాయువుతో సైతం సహజీవనం చేయాలని చెప్పకనే చెబుతోందని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమేనని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.