Pawan Kalyan about CBN:
జనసేన అధినేత Pawan Kalyan ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి తన మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో భారీ విజయం తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీ, మరియు బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల, పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడు గారి అనుభవం రాష్ట్ర పరిపాలనలో ఉపయోగపడుతుంది అని అన్నారు. “ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది. అనేక సమీక్షా సమావేశాలను నిర్వహించినప్పటికీ, అన్ని ఖాతాల్లోనూ నిధులు లేవనే తెలుస్తోంది. కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవంతో ఈ పరిస్థితిని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆయన ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో దిట్ట” అని పవన్ కల్యాణ్ అన్నారు.
అలాగే, రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు ప్రతీ నెల మొదటిరోజు జీతాలు అందజేయడం కూడా.. చంద్రబాబు నాయుడుకి ఆర్థిక పరిపాలనలో ఉన్న నైపుణ్యం వల్లే సాధ్యమైందని పవన్ కల్యాణ్ అన్నారు. “నాకు ప్రజల్లో గుర్తింపు ఉండచ్చు కానీ, పాలించడానికి కావలసిన అనుభవం లేదు. అందుకే, నా కంటే బాగా ఆలోచించగలిగిన, కష్టపడగలిగిన వారుంటే, వారి అడుగుజాడల్లో నడవడానికి లేదా వారితో పాటు ముందుకుసాగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు,” అని పవన్ కల్యాణ్ తెలిపారు.