Pawan Kalyan Political Party
పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి సినిమాల పైన.. కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించారు అనేది వాస్తవం. ఇక ఇప్పుడు ఏకంగా 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫలితాలలో ఆయన సెన్సేషన్ క్రియేట్ చేశారు. 21 గాను 21 స్థానాల్లో గెలుపు పొందారు. ఈ క్రమంలో రాబోయే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ను పవన్ కళ్యాణ్ ది చాలా కీలకమైన పాత్ర అని మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు పవన్ అసలు సినిమాలు చేస్తారా? లేదా ?అనేది అందరిలో మొదలైన సందేహం
Pawan Kalyan Upcoming Movies
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా అయితే ఏకంగా మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ దశలోనే పడుంది. మరోపక్క సుజిత్ దర్శకత్వంలో వస్తున్న.. ఓజి సినిమా కూడా ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. మరి పొలిటికల్ గా బిజీ అయిపోయిన పవన్ ఈ సినిమాలన్నిటికీ డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది సందేహం.
ఒకవేళ పవన్ సినిమాల పైన కాన్సెంట్రేట్ చేస్తే.. ఈ హీరో సినిమాలు చేస్తున్నారు పాలిటిక్స్ పట్టించుకోవడం లేదు అంటారు కొందరు. మరి అదే పవన్ పాలిటిక్స్ పై కాన్సెంట్రేట్ చేస్తే.. ఆయన సినీ అభిమానులు.. ఆయన సినిమాలు చేయాలి అంటూ డిమాండ్ చేయడం ఖాయం.
పిఠాపురం బాధ్యతలు.. పవన్ పార్టీ జనసేన వ్యవహారాలు.. మరోపక్క సినిమాలు.. ఇలా ఎన్నో బాధ్యతలు ఆయనపై ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మినిస్ట్రీ తీసుకుంటే..ఇక దానికి సంబంధించిన పనులు కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూనే సినిమాకు..డేట్లు మేనేజ్ చేసుకోవాలి. మరి ఇదంతా పవన్ కి సాధ్యమేనా అనేది ఎంతోమందికి ఉన్న అనుమానం. అయితే ఇలా రెండు పదవులపై ప్రయాణం ఎంతోమంది హీరోలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ ..బాలకృష్ణ లాంటి వారు రెండు పడవుల్లో కాళ్లు పెట్టి.. బాగానే కొనసాగారు. పవన్ కూడా వాళ్ళలానే అంత సక్సెస్ఫుల్ గా కొనసాగుతారేమో అనేది వేచి చూడాలి