పవన్ కల్యాణ్ అభిమానులంతా ‘బ్రో’ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. తమిళంలో గతేడాది అక్టోబర్లో విడుదలైన ‘వినోదయా సితం’ సినిమాకు ఇది రీమేక్. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌తో పాటు సాయిధరమ్ తేజ్ కలిసి నటించారు.
బ్రో సినిమాలోని మెయిన్ పాయింట్ బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారట. కథాపరంగా ఈ సినిమాకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు సరిపోతారు. తక్కువ బడ్జెట్‌లో చాలా తొందరగా ఈ సినిమాను పూర్తిచేశారు. పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌తో బ్రో సినిమా ఓ రేంజ్‌లో జరుగుతోంది.
బ్రో సినిమా నైజాం హక్కుల కోసం ఎగబడుతున్నారట. రూ. 30 కోట్లు చెల్లించి మైత్రీ మూవీస్ వారు తమ సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా నైజాం హక్కులను దక్కించుకున్నట్టు చెప్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు.