పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత వరుసగా సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రారంభించింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభమవుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.