పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుక్కనూరులో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో సమీక్షలు పెడుతున్నారు… కానీ, పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన ప్రజల కోసం ఏ రోజైన రివ్యూ లు పెట్టారా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్… ముంపు మండలాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని… చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్ పై ఉన్న శ్రద్ద… మా పై లేదంటూ ముంపు మండలాల ప్రజలు పవన్ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… నేను ముఖ్యమంత్రినో లేక ప్రతిపక్షాలనో విమర్శించడనికి రాలేదు, జాతీయ ప్రాజెక్టు పోలవరం, ఆ పోలవరం ప్రాజెక్టుకు మీరు చేసిన త్యాగానికి నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
జాతీయ ప్రాజెక్టుకు ముంపు మండలల ప్రజలు త్యాగం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోడం లేదేంటే చాలా బాధగా ఉందన్న పవన్… ముంపు మండలాల ప్రజలకు 2013 భూ సేకరణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని… జిల్లా కలెక్టర్ కి చేతులు ఎత్తి దండం పెడుతున్న ముంపు మండలాలను ప్రజలును పట్టించుకోండి… వారి బాధలు అర్థం చేసుకోండని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన కులాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించడంలేదన్న పవన్… ట్రాన్స్‌పోర్ట్ విషయంలో… ఆటోలో, లారీల టాక్స్‌ల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించి ముంపు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎంత శ్రద్ధతో ఉన్నారో… ముంపు మండలాల్లో ప్రజలను అంతే పట్టించుకోవాలి అని పవన్ అన్నారు .