కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ పోరాటంలో భాగంలో ఆయన చేసిన సూచనలను స్వాగతిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. జాతిని ఉద్దేశించి మోడీ గారు చేసిన సూచనలను జన సైనికులే కాక తెలుగు వారందరూ పాటించాలని పవన్ కల్యాన్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 వ తేదీ ఆదివారం రోజు మోడీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూ గా పాటిద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘ఆ రోజు (మార్చి 22) ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదామన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికిగాను ప్రమాదమని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రతీ ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ.. మన ప్రధాన మంత్రి చెప్పినట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన ఇంటి బాల్కనీలలో నిలబడి కరతాళ ధ్వనులు ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదాం.’ అని జనసేనాని అన్నారు.