టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ వుంది. గతంలో వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి, వాటిలో రెండు సినిమాలు సూపర్ హిటైయ్యాయి. తాజాగా నాలుగో సినిమా వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేసి ఆయనకి వినిపించడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రం చేస్తున్న పవన్ కల్యాణ్, ఆ తరువాత సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు విడుదల తరువాత, పవన్ – త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనున్నట్లు తేలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.