జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 12 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. పొలిట్‌బ్యూరోలో నాదెండ్ల మనోహర్, పి. రామ్మోహన్‌రావు, రాజు రవితేజ్, అర్హం ఖాన్‌లకు చోటు కల్పించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో 11 మందికి పవన్ చోటు కల్పించారు. ఇందులో తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్, కొణిదెల నాగబాబు, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, పసుపులేటి హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, ఎ. భరత్ భూషణ్, బి. నాయకర్‌లు ఉన్నారు. క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు.