HomeTelugu Trendingబ్రో: అదిరిన స్పెషల్‌ పోస్టర్‌

బ్రో: అదిరిన స్పెషల్‌ పోస్టర్‌

 

BRO new poster Not up to the markపవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న చిత్రమే ‘బ్రో’. ప్రముఖ నటుడు దర్శకుడు సముద్రఖని ఈసినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’కు ఇది రీమేక్గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో ఉన్నాయి.

మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి నటిస్తోన్న ‘బ్రో’ మూవీ నుంచి వరుసగా అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. దీని నుంచి ఇప్పటికే పవన్ కల్యాణ్ సాయి ధరమ్ తేజ్ పాత్రలకు సంబంధించిన రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఉన్న మరో పోస్టర్ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఆదివారమే అనౌన్స్ చేసింది.

ముందుగా ప్రకటించినట్లుగానే ఈరోజు ‘బ్రో’ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ సాయి ధరమ్ తేజ్ తమదైన స్టైల్తో దర్శనమిచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ బైక్ మీద కాలు వేసి స్టైల్‌గా నిల్చునాడు.

అతడి వెనకాలే సుప్రీమ్ హీరో పద్దతిగా నిల్చుని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్కు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా జూలై 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ కు సంబంధించి చాలా భాగాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆయన చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇందులోనే ఓ స్పెషల్ సాంగ్‌ని సైతం షూట్ చేస్తారని అంటున్నారు. ఇందులో శృతి లేదా దిశా ఉంటారని టాక్.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu