పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ నటుడు డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ రోజు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. మామా అల్లుళ్లు ఇద్దరూ బ్లాక్ కలర్ హుడీస్ వేసుకొని మొదటి రోజు షూటింగ్ లో సందడి చేశారు. చూసేందుకు చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే.. చిత్ర బృందంతో కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వినోదయ సీతమ్’ సినిమాకు రీమేక్ ఈ చిత్రం. అయితే పవన్ కల్యాణ్ కేవలం 25 రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ లో పాల్గొంటారు. కేవలం 25 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయబోతున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాయనున్నారు.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారట. మార్చి నెలాఖరు వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని.. ఆగస్టు నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ నటింబోతున్నారు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు