పవన్‌కల్యాణ్, ఆలీ తాజాగా మంచి ఫ్రెండ్స్ అని తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి తాజాగా ఓ స్టేజ్‌పై కొంతసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలీ బంధువుల నివాసంలో జరిగిన వివాహ వేడుకకు వీరిద్దరూ హాజరయ్యారు. పవన్ కల్యాణ్‌తో అలీ, ఆయన భార్య సెల్ఫీ తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకున్న ఫొటోలు అలీ భార్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోని పరిణామాల తర్వాత పవన్, అలీ కలిసి ఉన్న ఫొటోలు ఏమీ బయటకు రాలేదు. పవన్ నటించిన అనేక సినిమాల్లో అలీ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు కలిసి వున్న ఫొటోలు చూసిన అభిమానులు సంతోషిస్తున్నారు.
https://www.instagram.com/p/CLf3mtmAw-j/?utm_source=ig_web_copy_link