HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌ 27వ సినిమా ప్రీ లుక్..

పవన్‌ కల్యాణ్‌ 27వ సినిమా ప్రీ లుక్..

Pawan kalyan 27th movie Pre
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరో స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. పవన్‌-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ #PSPK27 పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడని అర్థం అవుతోంది. పవన్ పేస్ ని రివీల్ చేయకుండా ధీరత్వంతో నడుము మీద చేయి వేసుకుని నిలబడినట్లు చూపించారు. ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా క్రిష్ పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెష్ తెలుపుతూ.. ”పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు మీ ప్రోత్సాహం మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu