Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాత్ర ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఎంత కీలకం అనేది.. ఇప్పటికే ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. క్యారం బోర్డు లో కాయిన్స్ ని చెల్లాచెదురు చేయాలంటే.. ఆ పవర్ ఒక్క స్ట్రైకర్ కి మాత్రమే ఉంటుంది.. అలానే వైసిపి నాయకులను చెల్లాచెదురు చేసే పవర్.. ఏపీ రాజకీయాల్లో పవర్ స్టార్ కి ఒక్కడికే సాధ్యమైంది.
కొద్దిరోజుల ముందు వరకు కూడా.. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో లేకపోలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక స్ట్రైకర్ వల్ల.. వైసీపీ నాయకుల దిమ్మతిరిగింది. పవన్ కళ్యాణ్..టిడిపి తో పొత్తు పెట్టుకోవడంతోనే.. ఆంధ్రప్రదేశ్లో రాబోయే పార్టీ ఏది అనేది అందరికీ అర్థం అయిపోయింది.
పవన్ కళ్యాణ్ వేరుగా పోటీ చేసి ఉంటే.. తప్పకుండా ఓట్లు చిలేవి. అప్పుడు టిడిపికి ఒక 30% పవన్ కి ఒక 30% వచ్చిన.. మిగతా 40%తో వైసిపి గెలిచి ఉండేది. అయితే ఈ ట్రెండ్ మొత్తాన్ని రివర్స్ చేశాడు పవన్. టిడిపిలోకి పవన్ ఎంట్రీ.. ఆంధ్ర ప్రజలకు ఒక కొత్త ఆశను చూపించింది.
ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతాడు అనే అనుమానాలు ఉన్న అందరికీ…పవన్ ఎంట్రీ ఒక క్లారిటీ ఇచ్చింది. అందుకే ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే.. టిడిపి.. జనసేన నేతలు పండగలు మొదలు పెట్టుకోగా…వైసీపీ నేతలు తమ ఫ్రస్ట్రేషన్ చూపిస్తూఉన్నారు.
మొత్తానికి 2024 పాలిటిక్స్ ని డిసైడ్ చేసిన ఒక వ్యక్తి ఉన్నారు అంటే.. అది తప్పకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆయన ఉంటే ఒక లెక్క లేకపోతే మరో లెక్క..అన్నట్టు చేశాడు ఈ హీరో..