HomeTelugu Newsనన్ను రెచ్చగొట్టొద్దు: పవన్‌

నన్ను రెచ్చగొట్టొద్దు: పవన్‌

6 12జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ల నుంచి పోరాటం చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు పంచడం వైసీపీకే సాధ్యమైందని, అందుకే ఆ పార్టీ అధికారంలో ఉందన్నారు. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి మనపై కక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యేనూ లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాపాకపై పలు కేసులు పెట్టారన్నారు. వివేకా హత్య కేసు విచారణలో ఎందుకు వేగం లేదు? నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేపై కేసు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. తనను రెచ్చగొట్టొద్దని, ఎంతవరకైనా పోరాడతానని పవన్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu