బిహార్ గత కొన్ని రోజులుగా వర్షాలతో అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడి నీరు అక్కడే..ఎక్కడ జనాలు అక్కడే. వారం రోజులుగా వారి వేదన వర్ణనాతీతం. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో నరకం అనుభవిస్తున్నారు. ఓవైపు జనాలు అల్లాడిపోతుంటే, అదే వర్షపు నీటిలో ఓ యువతి ఫొటోషూట్ చేయించుకుంది. ఫలితంగా నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటోంది.
పట్నాకు చెంర్థిని వరద నీటిలో ఫొటోషూట్ దిన అదితి సింగ్ అనే ఫ్యాషన్ టెక్నాలజీ విద్యాచేయించుకుంది. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్‌చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. వరద నీటిలో ఫొటోలు తీయించుకుని.. ఫొటోషూట్ చేసేటప్పుడే వర్షం పడిందని వివరిస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌లో చెట్లు కింద పడిపోయి ఉండటం, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండటం కనిపిస్తోంది. పైగా ఆమెను జలకన్య అని వర్ణిస్తూ పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.వరద కారణంగా బిహార్‌లో జనజీవనం స్తంభించడం పట్ల జాలి పడాల్సిందిపోయి. ఈ ఫొటో షూట్‌లేమిటని చీవాట్లు పెడుతున్నారు. ఎటూ వెళ్లలేక వారు రోదిస్తుంటే నవ్వెలా వస్తుందంటూ మండిపడుతున్నారు.