HomeTelugu Trendingడీజే టిల్లు: 'పట్టాసు పిల్లా .. పట్టాసు పిల్లా' సాంగ్‌ విడుదల

డీజే టిల్లు: ‘పట్టాసు పిల్లా .. పట్టాసు పిల్లా’ సాంగ్‌ విడుదల

PataasPilla Full song from
సిద్ధు జొన్నలగడ్డ – నేహాశెట్టి హీరో,హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు’. సితార – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న తాజాగా ఈ సినిమా నుంచి ‘పట్టాసు పిల్లా .. పట్టాసు పిల్లా’ అనే సాంగ్ ను విడులైంది. హీరో హీరోయిన్లపై ఈ పాటను చిత్రీకరించారు. లవ్ .. రొమాన్స్ ను ప్రధానంగా చేసుకుని సాగే పాట ఇది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, సంగీత దర్శకుడు అనిరుధ్ ఆలపించాడు.

‘ఆరెంజ్’ .. ‘గుంటూరు టాకీస్’ .. ‘కల్కి’ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను పోషించిన సిద్ధు, ఈ సినిమాలో రొమాంటిక్ హీరోగా మార్కులు కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. బ్రహ్మాజీ .. ప్రగతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!