Parvovirus: తెలంగాణలో కుక్కలు ప్రజల పాలిట ప్రాణాపాయంగా మారుతున్నాయి. నగరంలో వీధి కుక్కలు హల్‌ఛల్ చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా ఉంటూ.. బయటకు వెళ్ళాలంటే.. భయపడే పరిస్థితికి తీసుకు వచ్చాయి.
ఇన్ని రోజులు మనుషులపై, చిన్న పిల్లలుపై దాడి చేస్తూ.. ప్రజలను బెంబేలెత్తిస్తున్న కుక్కలకు తాజాగా సోకిన వైరస్‌తో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కుక్కలకు ‘పార్వో’ వైరస్ వ్యాపించిన ఘటనలు వెలుగు చూశాయి.
జనవరి 1 నుంచి మార్చి 15 వరకు 87 కుక్కలకు పార్వో వైరస్ సోకింది. అందులో 15 కుక్కలు మృత్యువాత పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని బ్లాకుల్లోని పశువైద్యశాలల్లో ప్రతి రోజు 4 నుంచి 5 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో పెంపుడు కుక్కలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రాష్ట్రంలోని నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో కూడా పార్వో కేసులు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని పల్తితండాలో 70కిపైగా కుక్కలకు పార్వో వైరస్ సోకినట్టు పశువైద్యులు గుర్తించారు. వైరస్ సోకిన కుక్కలకు బొబ్బ లు, పుండ్లు, రక్తం, చీము వస్తుంది. ఆ కుక్కలపై వాలిన దోమలు మనుషులను కుట్ట డం వల్ల చాలా మంది వైరల్ ఫీవర్స్, నొప్పుల బారిన పడుతున్నారు.