టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి షీలా. గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా ఇటీవల వివాహం చేసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహామాడారు. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం వేడుకగా జరిగింది. ఈ మేరకు భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె ఫేస్‌బుక్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ఈరోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం.. మా గుండె లోతుల్లోని సంతోషం.. మేమిద్దరం కలిసి నూతన జీవితం ఆరంభించే ఓ కొత్త రోజు’ అని షీలా పేర్కొన్నారు.
2006లో రిలీజైన ‘సీతాకోకా చిలుక’ సినిమాతో షీలా తెలుగు తెరంగెట్రం చేసింది. ఆ తర్వాత ఏడాదిలో విడుదలైన ‘రాజుభాయ్’ సినిమాలో మంచు మనోజ్ సరసన ఆమె నటించారు. అయితే ఆ రెండు సినిమాలు ఆమెకు ఆశించిన గుర్తింపు అందించలేకపోయాయి. అనంతరం ఆమె 2008లో విడుదలైన ‘పరుగు’ సినిమాలో బన్నీ సరసన షీలా నటించారు. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ‘పరుగు’ చిత్రం తర్వాత వరుసగా ఎన్టీఆర్, రామ్, బాలకృష్ణ చిత్రాల్లో షీలా నటించారు. 2011లో విడుదలైన ‘పరమ వీర చక్ర’ సినిమా తర్వాత తెలుగు సినిమాకు దూరమైయ్యారు.