అనిల్ రావిపూడి తెరెకెక్కించిన ‘ఎఫ్-3’పై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాపై పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పరుచూరి పలుకులు వేదికగా ఎఫ్-3 మూవీపై తన రివ్యూను వీడియో ద్వారా విడుదల చేశారు. ఎఫ్-2లో భార్యభర్తల మధ్య పెత్తనం అనే అంశం అందరికీ కనెక్ట్ అయ్యింది.
అనిల్ రావిపూడికి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. కానీ తాజాగా నేను ఎఫ్-3 సినిమాను చూశాను. గతంలో ‘శ్రీ కట్న లీలలు’లో మేము చేసిన పొరపాటే అనిల్ రావిపూడి ఈ సినిమాలోని సెకండాఫ్‌లో చేశారనే అనుమానం నాకు కలిగింది. సెకండ్ ఆఫ్‌లో మురళీ శర్మ కొడుకుగా వెంకీని చూపించడం అతకలేదు. తమన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలా చూపించడం సహా సెకండాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ అర్థం పర్థం లేనట్లు అనిపించింది.
కాస్త లాజిక్ లేకున్నా వెంకటేశ్ ఒప్పుకోడు. ఈ పాత్రను ఎలా ఓకే చేశాడో అర్థం కావడం లేదు. కుటుంబం మొత్తం హోటల్ నడుపుకుంటూ ఉంటే మెహ్రీన్ మాత్రం వేరే ఇంట్లో పనిమనిషిగా చేయండం అంతగా నప్పలేదు. ఇలా ఎన్నో తప్పులున్నా చివరి 20నిమిషాలే ఎఫ్-3ని బతికించాయి అని పరుచూరి చెప్పుకొచ్చారు.