బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా- ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పరిణీతి చోప్రా తరపు బంధు మిత్రులతో పాటు ఆప్ ఎంపీ అవ్వడం వల్ల రాఘవ్ చద్దా తరపున భారీ ఎత్తున పొలిటికల్ పార్టీల నాయకులు హాజరు అయ్యారు. ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హాజరు అయ్యారు.
22న పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఆ రోజు నుండి నాలుగు రోజుల పాటు వరుసగా పెళ్లి హంగామాతో ప్యాలెస్ వెలిగి పోయింది. బాలీవుడ్ ప్రముఖులు సంగీత్ కార్యక్రమానికి హాజరు అవ్వడంతో కలర్ ఫుల్ గా సాగింది.
పెళ్లి తర్వాత పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దాల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింక్ చీర కట్టు లో నుదుట బొట్టు పెట్టుకుని సింపుల్ గా మెడలో ఒక హారం ధరించి, చెవులకు సింపుల్ ఆభరణం ధరించి రెండు చేతుల నిండుగా మ్యాచింగ్ గాజులు ధరించింది. దీంతో నెటిజన్లు.. పరిణీతి చోప్రా నిండైన గృహిణిగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.