భారత్‌లో అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి యశ్ రాజ్ ఫిలింస్. ఈ సంస్థ నుంచి పరిచయమైన హీరోయిన్లంతా అగ్రస్థానాల్లో ఉన్నారు. ఆ సంస్థ హీరోయిన్ అంటే ఎలా ఉండాలో చెబుతున్నారు నటి పరిణీతి చోప్రా. యశ్‌రాజ్ సంస్థ నిర్మించిన ‘లేడీస్ వర్సెస్ రికీ బెహెల్’ చిత్రంతో పరిణీతి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని ఫొటోలకు పోజులిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘యశ్‌రాజ్ హీరోయిన్ ట్యుటోరియల్. మధ్ ద్వీపంలో ఫేక్ స్విట్జర్లాండ్, 34 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఫేక్ మంచు. ఫేక్ గాలి. ఒక పాట. ఈ సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 15 లక్షల మందికి పైగా వీక్షించారు.
‘కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరిణీతి చోప్రా త్వరలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించనున్నారు. దీంతో పాటు ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’, ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రాల్లో నటిస్తున్నారు.