కరోనా వైరస్ పేరు చెప్తే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రదేశాలైన కరోనా దెబ్బకు హడలెత్తి పోతున్నాయి. ఇప్పటికే మన దేశంలో 76 కేసులునమోదు కాగా… ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో దేశం అప్రమత్తం అయ్యింది. ప్రజలలో అవగాహనా కల్పించే కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు కరోనాపై ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా ఈ బాలీవుడ్ బ్యూటీ కరోనా తక్కువ అంచనా వేయద్దని అంటుంది. నాకెందుకు వచ్చిదిలే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ను వదిలి పెట్టాలని అంటుంది.
బాలీవుడ్ ముద్దు గుమ్మా పరిణీతీ చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కరోనా పై అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. కరోనా వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుందని ప్రచారం మానుకోవాలన్నారు. అదేవిధంగా వైరస్ వల్ల కలిగే మరణాలు రేటు ఎక్కువని ప్రజలకు భయాందోళనలకు గురిచేయద్దని కోరారు. మనం వైరస్ కంటే తెలివైన వారమని అనుకోవడం మానుకోవాలని పరణీతి సూచించారు. ప్రస్తుతం ఈ భామ సైనానెహ్వాల్ బయోపిక్ లో నటిస్తుంది.