పాకిస్థాన్‌కు ఏమాత్రం అవకాశం దొరికినా భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకస్థాన్‌కు అనుకున్న స్థాయిలో ఇతర దేశాల నుంచి మద్దతు రాకపోవడంతో భారత్‌పై కక్ష చూపిస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను ఈ వివాదంలోకి లాగింది. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రా హోదాను తొలగించాలంటూ యునిసెఫ్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. పాకిస్థాన్‌కు సంబంధించి భారత ప్రభుత్వ నిర్ణయాలు, పొంచి ఉన్న అణుముప్పుకు ప్రియాంక మద్దతు తెలుపుతున్నారంటూ విమర్శలు చేసింది. ఆమెను అంబాసిడర్ హోదా నుంచి తొలగించాలని కోరుతూ లేఖ రాసింది. 2016లో స్టార్ హీరోయిన్ ప్రియాంక యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా నియమితురాలైంది.