HomeTelugu Newsపాక్‌లో ఘోర విమాన ప్రమాదం

పాక్‌లో ఘోర విమాన ప్రమాదం

10 19

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో కుప్పకూలింది. కొద్దిసేపటిలో ల్యాండ్ అవుతుందనగా ఈ దుర్ఘటన జరిగింది. జనావాసాల మధ్య విమానం కూలిపోవడంతో నష్టం భారీగా ఉంటుందని, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే విమానంలో 90 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 107 మంది చనిపోయారని సమాచారం. ఇప్పటివరకు 37 మృతదేహాలను వెలికితీసినట్లు సింధ్ ఆరోగ్య మంత్రి అజ్రా పెచుహో వెల్లడించారు.

విమానంలోని 2 ఇంజిన్లు పనిచేయకపోవడంతో ఓ ఇంజిన్‌లో మంటలు చేలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ-320 విమానం లాహోర్‌ నుంచి కరాచీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాక్ విమాన ప్రమాదంపై సంతాపాన్ని వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu