HomeTelugu Trendingకంగనపై పాకిస్తాన్ నటి సంచలన వ్యాఖ్యలు

కంగనపై పాకిస్తాన్ నటి సంచలన వ్యాఖ్యలు

Kangana vs Nausheen
బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై పాకిస్తాన్ నటి నౌషీన్‌ షా ఆగ్రహం వ్యక్తం చేసింది. చెంపదెబ్బలు కొట్టేందుకు కంగనను కలవాలని ఉందని అంటోంది. పాకిస్తాన్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కంగనపై మండిపడుతోంది.

‘మోమిన్ సాకిబ్‌తో హద్ కర్ ది చాట్‌ షో’ లో పాల్గొన్న నౌషీన్‌ను బాలీవుడ్ తారలను ఎవరినైనా కలవాలనుకుంటున్నారా? అన్ని ప్రశ్నించగా.. కంగనాను కలిసి చెంపదెబ్బలు కొట్టాలనుకుంటున్నట్లు తెలిపింది.

కంగనకు వ్యక్తులను గౌరవించడం తెలియదని మండిపడింది. ఆమె నా దేశం గురించి మాట్లాడే విధానం, పాకిస్తాన్ సైన్యం గురించి ఆమె చాలా చెత్తగా చెప్పే విధానానికి, ఆమె ధైర్యానికి నమస్కరిస్తున్నాను.

ఆమెకు జ్ఞానం లేదు కానీ మరో దేశం గురించి మాట్లాడుతుంది. మీ సొంత దేశంపై.. మీ నటనపై దృష్టి పెట్టండి. మీ డైరెక్షన్, మీ మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌లపై దృష్టి పెట్టండి అంటూ సూచించింది. ప్రస్తుతం నౌషీన్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కంగనా అభిమానులు మాత్రం నౌషీన్‌పై మండిపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu