నటీనటులు: బాలకృష్ణ, శ్రియ, విక్రమ్ జీత్, ముస్కాన్ సేతీ, కైరా దత్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ముఖేష్
ఎడిటింగ్: జూనైద్ సిద్ధిఖి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
బాలకృష్ణ, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘పైసా వసూల్’. ఈ సినిమాపై మొదటినుండి కూడా అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా మొదటిసారి కావడంతో అందరూ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
పోర్చుగల్ లో ఉండే ఇంటెర్నేషనల్ క్రిమినల్ బాబ్ మార్లే(విక్రమ్ జీత్) తనకున్న నెట్ వర్క్ ద్వారా ఎన్నో నేరాలు చేస్తుంటాడు. ఇండియన్ గవర్న్మెంట్ బాబ్ మార్లేను పట్టుకోవాలని అనుకుంటుంది. కానీ అతడికి రాజకీయనాయకులతో సంబంధాలు ఉండడంతో పోలీసులు కూడా వారిని ఏం చేయలేకపోతారు. అదే సమయంలో తీహార్ జైలు నుండి తేడా సింగ్(బాలకృష్ణ)
అనే వ్యక్తి బయటకు వస్తాడు. అతడి ద్వారా బాబ్ మార్లేను అంతం చేయాలనుకుంటారు పోలీసులు. మరి ఈ ఆపరేషన్ కు తేడా సింగ్ అంగీకరిస్తాడా..? బాబ్ మార్లేను. తేడా సింగ్ అంతం చేస్తాడా..? అసలు ఈ తేడా సింగ్ ఎవరు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
బాలకృష్ణ
సినిమాటోగ్రఫీ
డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
కథ, కథనాలు
పూరి గత చిత్రాలను పోలి ఉండడం
విశ్లేషణ:
హీరో క్రిమినల్ గా మారి రౌడీలను చంపుతుంటాడు. అసలు హీరో ఎందుకిలా చేస్తున్నాడు అంటే అతడో రా ఏజెంట్ అని తెలుస్తుంది. చివరకు విలన్ ను హీరో ఎలా అంతం చేశాడనేది ఈ సినిమా స్టోరీ. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. పూరి ఇదే పాయింట్ తో చాలా సినిమాలు చేశాడు. మరోసారి దీన్నే నమ్ముకున్నాడు. అయితే బాలకృష్ణ పాత్రను ఆయన
డిజైన్ చేసిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాలో బాలయ్య చాలా కొత్తగా కనిపించాడు. పూరి మార్క్ హీరోయిజంలో అతడు ఒదిగిపోయాడు.
అయితే బాలయ్య లుక్ పై మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. టీషర్ట్స్ లో బాగా వయసు పైబడిన వ్యక్తిగా బాలయ్య అగుపించాడు. కానీ సినిమా మొత్తం బాలయ్య వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అతడు చెప్పే డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్స్, డాన్సుల్లో బాలకృష్ణ బాగా కష్టపడ్డాడు. య నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ముస్కాన్, కైరా దత్ లకు పెద్దగా నటనకు అవకాశం లేదు. విలన్ రోల్ లో విక్రమ్ జీత్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. పూరి అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా రూపొందించాడు పూరిజగన్నాథ్. ముఖ్యంగా అభిమానులను ఊర్రూతలూగించే డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు.
హీరో పాత్ర, దాని తీరుతెన్నుల్లో గత చిత్రాల హీరోల ఛాయలు కనిపించినా డైలాగ్స్ లో కొత్తదనం చూపించాడు. అయితే కథ, కథనాలు రొటీన్ గా ఉండడంతో సినిమాపై కాస్త నిరాశ కలుగుతుంది. పూరి టేకింగ్, రిచ్ విజువల్స్ మాత్రం మెచ్చుకునే విధంగా ఉన్నాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. పోర్చుగల్ లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అనూప్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.
రేటింగ్: 2.75/5