కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ ఓ ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. విను బాసు చెబుతా.. ఈ లోకమెవ్వారం’ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జేక్స్‌బిజోయ్ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ‘‘బస్తీ బాలరాజు’’ వంటి పాటలు చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మురళీ శర్మ, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.