గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ ఏడాదికి గాను నలుగురికి పద్మవిభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారంగా పరిగణించే పద్మవిభూషణ్‌కు టీజెన్‌బాయ్, ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్‌కుమార్ మణీబాయ్, బల్వంత మోరేశ్వర్ పురంధేరలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 2018 సంవత్సరానికి గాను నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, యడ్లపల్లి వెంటేశ్వరరావు, సునీల్ ఛెత్రికు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.