టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. ఈ సినిమాతో నూతన దర్శకుడు నరేష్ కొప్పలి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో విశ్వక్ నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న థియేటర్‌ల్లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పాగల్’ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
దీనితో..నా పేరు ప్రేమ్.. నేను 1600 మంది అమ్మాయిలను ప్రేమించాను’ అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, జబర్దస్త్ మహేష్, ఇంద్రజ శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. రథన్ సంగీతం అందించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.