HomeOTTOTT Releases: ఆఖరికి ఓటిటి లో కూడా వాళ్ళ రాజ్యమేనా!

OTT Releases: ఆఖరికి ఓటిటి లో కూడా వాళ్ళ రాజ్యమేనా!

ott 3 OTT
OTT platforms flooded with other language movies

OTT Movies: కరోనా సమయం నుంచి ఓటీటీలకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా పరభాష సినిమాలకి ఓటిటి ప్లాట్ఫామ్ లు ఇంకా బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా తమిళ్, మలయాళం సినిమాల మీదే అందరి కన్ను ఉంది.

మలయాళం నుంచి బోలోడు సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. తమిళ్లో కూడా హిట్ అయిన చాలా సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఒకసారి త్వరలో విడుదల కాబోతున్న పరభాష సినిమాల గురించి లుక్కు వేయండి.

OTT Malayalam Dubbing Movies:

ది గోట్‌ లైఫ్‌ (ఆడు జీవితం):

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బెన్నీ డానియల్‌ (బెన్యామిన్) అనే ఒక రచయిత రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వం వహించారు. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెలలోనే డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది.

టర్బో:

మలయాళం స్టార్ మమ్ముట్టి హీరోగా విడుదల అయిన సస్పెన్స్ థ్రిల్లర్ టర్బో కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జూన్ 28వ తేదీ నుంచి ప్రేక్షకులకి అందుబాటులోకి రాబోతోంది. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది.

OTT Tamil Dubbing Movies:

అరన్మయి 4/బాక్:

తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ హారర్‌ థ్రిల్లర్‌ సినిమా బాక్‌ కూడా తమిళ్లో సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఇవాళ జూన్‌ 21వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమ్ కానుంది.

గరుడన్:

తమిళంలో మంచి విజయం సాధించిన గరుడన్‌ సినిమా కోసం కూడా ఓటీటీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి వెట్రిమారన్ కథ అందించగా.. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

గురువాయూర్ అంబలనాడయిల్:

కోలీవుడ్‌ స్టార్ కమెడియన్‌ యోగిబాబు నటించిన గురువాయూర్ అంబలనాడయిల్ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా జూన్‌ 28వ తేదీ నుండి స్ట్రీమ్ కానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu