కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో చేసేది లేక.. విడుదలకు రెడీ అయిన సినిమాలు కొన్ని ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అందులో ఒకటి యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లు నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందననే రాబట్టుకుంది. ఇక కరోనా అన్‌లాక్ తర్వాత తెరుచుకున్న థియేటర్స్ తెరచుకున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1న థియేటర్లలో కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ‘2021కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కానుకగా మా బేనర్లో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా..’ చిత్రాన్ని జనవరి 1న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం.. అందరూ ఈ చిత్రాన్ని బిగ్ స్ర్కీన్‌పై చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం.. ” అని అన్నారు.