హీరో సిద్ధార్థ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ డైరెక్టర్ శశి ఈసినిమాని రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో సిద్దార్థ్ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సిద్దార్థ్, జీవీ ప్రకాశ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ, వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బతకాల్సి వస్తుంది. డిపార్ట్‌మెంట్ లోపలైనా బయటైనా ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి, ఈ లోకంలో ఎవరో ఒక్కరితోనైనా 200శాతం నిజాయతీగా ఉండాలనుకుంటున్నాను’ అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.