Orange to Khaleja: ప్రస్తుతం టాలీవుడ్‌లో రి రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. పలు సినిమాలు వెండితెరపై వివిధ పలు సందర్భల్లో విడుదలై ఫ్లాప్‌లుగా నిలుస్తాయి. అయితే కొన్నేళ్ల తర్వాత అవే సినిమాలు టీవీల్లో మాత్రం మంచి రేటింగ్స్ సాధిస్తుంటాయి. అలాంటి మూవీస్ రీ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ వాటిని నెక్ట్స్ లెవల్‌లో ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం..
ఆరెంజ్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘ఆరెంజ్’. మగధీర మూవీ తరువాత వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫలితం అనుకున్న విధంగా రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ అప్‌డేటెడ్ ఐడియాను అప్పటి ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు. అయితే టీవీల్లో వచ్చినప్పుడు ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంకరేజ్ చేశారు. రీరిలీజ్లోనూ ఈ సినిమాను చూసేందుకు ఎంతో మంది థియేటర్లకు క్యూ కట్టారు. అంతేకాదు.. అప్పుడు పిల్లలం తెలియక సినిమా ప్లాప్ చేశాం అని కొందరి డైరెక్టర్ ముందు మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఖలేజా: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా. డిఫరెంట్ కన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా ఛానల్ మార్చుకుండా చూస్తారు. ఇప్పుడు కూడా టీవీలో దీనికి అదిరిపోయే రేటింగ్ వస్తుంది.
ఓయ్: ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఈ సినిమా థియేటర్‌ల్లో రీ రిలీజ్ అయి సందడి చేసింది. సిద్దార్థ్, షామిలి హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా అపట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రీ రిలీజ్‌కు మాత్రం ఈ సినిమాను ఇప్పుడు ఆడియెన్స్ ఓ రేంజ్లో చూశారు. టీవీలో కూడా సూపర్ టాక్ అందుకుంది ఈ మూవీ.
వేదం: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క కీ రోల్స్ పోషించిన ‘వేదం’. పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా మూవీ థియేటర్లలో ఆశించినంతగా ఆడలేదు. అయితే టీవీలో మాత్రం దీనికి మంచి రేటింగ్ వచ్చింది.
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్: నా ఆటోగ్రాఫ్ 2004 లో ఎస్. గోపాల రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. రవితేజ, భూమిక, గోపిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నా ఆటోగ్రాఫ్’. ఈ సినిమా రిలీజైనప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. బుల్లితెరపై మాత్రం హిట్ కొట్టింది.
గౌతమ్ నంద: హీరో గోపిచంద్, హన్సిక, కేథరిన్ ట్రెసా హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘గౌతమ్నంద’. ఈ సినిమా థియేటర్లలో అంత టాక్ రాలేదు. అయితే ఈ మూవీని టీవీ ప్రేక్షకులు బాగా ఆదరించారు.