నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఓ..పిట్టకథ’. చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాంత్, నిత్య, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
పోస్టర్ విడుదల అనంతరం ‘ఓ పిట్టకథ’ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో నాకు మంచి అనుబంధం ఉంది. దీనికి ఎలాంటి టైటిల్ ఉంటే బావుంటుందనే డిస్కషన్ వచ్చినప్పుడు, దర్శకుడు చందు రెండు, మూడు టైటిల్స్ చెప్పారు. అందులో ‘ఓ పిట్టకథ’ అనే టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. ‘ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ’ అనే క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. అంతవరకే నా కంట్రిబ్యూషన్. కథ నచ్చింది. టైటిల్ బావుంది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఈ టైటిల్ పోస్టర్‌ని విడుదల చేయడానికి ఒప్పుకున్నాను’ అని అన్నారు.