వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తిప్రతాప్ సింగ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ పేరిట టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే.. వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండగా.. పాకిస్తాన్‌లో ఉన్న టెర్రరిస్ట్‌లను అంతమొందించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసే మిషనే ఆపరేషన్ వాలెంటైన్ అని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ చెప్పే.. ‘శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‌ది కూడా’ అనే డైలాగ్ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుంది. భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనుండగా.. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.