మెగా పిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజా జరిగిన సంగతి తెలిసిందే. రక్తాన్నీ, స్వేదాన్ని ధారపోసి చేసిన సినిమా ఇదని, బాధ్యతగా భావించి ఈ సినిమా చేశామని, తన కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైన సినిమా అని వరుణ్‌తేజ్ అన్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ..’దేశంకోసం ప్రాణాలను పణంగా పెట్టే వీరసైనికుల గాధలపై రీసెర్చ్ చేసి, నేరుగా వారిని కలిసి, వారి సూచనలను కూడా తీసుకొని తయారు చేసుకున్న కథ ‘ఆపరేషన్ వాలంటైన్’. ఇలాంటి కథలు చూసినప్పుడు మనసంతా ఉద్వేగంతో నిండిపోతుంది. లేచి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. అందుకే.. ఈ వేడుకకు వరుణ్ ఆహ్వానించినప్పుడు అదో బాధ్యతగా, సదావకాశంగా భావించాను.’ వరుణ్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు అన్నీటిలోనూ.. విభిన్నమైన పాత్రలతో మంచి నటుడిగా ఎదిగాడు. ఈ విషయంలో వరుణ్‌ని కచ్చితంగా అభినందించాలి. సినిమా బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అని చిరంజీవి ఆకాంక్షించారు.
నాగబాబు మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కానీ వరుసగా వరుణ్ ఫెయిల్యూర్ చూస్తున్నారు. ఎంతో కష్టపడ్డా ఫలితం లేదనే భావన కలుగుతోంది. వరుణ్ తేజ్ సినిమా ఫెయిల్ అయితే ఎంతో బాధపడుతాడు. ఆ రోజంతా మౌనంగా ఉంటాడు. నేను కూడా చాలా బాధపడుతాను. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటాను. కానీ వరుణ్ చేస్తున్న ఒక్కో సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలా సినిమాలు చేయడంతో ప్రస్తుతం వరుణ్ కు స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ఇలాగే ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్స్’ తో ఆర్మీ ఆఫీసర్ గా అలరించబోతుండటం సంతోషంగా ఉందన్నారు. ఇలా తొలిసారిగా వరుణ్ తేజ్ సినిమా ఫంక్షన్ కు వచ్చి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.