వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలైంటైన్‌’కు భారీ డీల్‌!

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలైంటైన్‌’. ఏయిర్‌ ఫోర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేశాయి. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతుంది. ఈ సినిమా నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ అన్ని భాషలకు కలుపుకుని రూ.50 కోట్ల రేంజ్‌లో డీల్ కుదరిందట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఓ మీడియం రేంజ్‌ టాలీవుడ్‌ హీరోకు కేవలం థియేట్రికల్‌ రైట్స్ ఈ రేంజ్‌లో రేటు పలికాయంటే మాములు విషయం కాదు. పైగా వరుణ్‌తేజ్‌ చివరి మూడు సినిమాలు అల్ట్రా డిజాస్టర్‌లు.

మాజీ మిస్‌ యూనివర్స్‌ మానూషీ చిల్లర్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో వరుణ్ ఏయిర్‌ ఫోర్స్‌ అధికారిగా కనిపించనున్నాడు. భారత వాయుసేన సాహసాల నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్‌ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ఇటీవలే వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu